సమంత కొత్త అవతారం.!
- December 12, 2023
సమంత ఓ స్టార్ హీరోయిన్ అందులో నో డౌట్. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇటీవల ‘మయో సైటిస్’ అనే వ్యాధి కారణంగా సినిమాలను కాస్త తగ్గించిందంతే. కానీ, మానేయలేదు.
ఏదో ఒక రకంగా సమంత వార్తల్లో నిలుస్తూనే వుంది. సోషల్ మీడియాలో సమంతకి సంబంధించి ఏ న్యూస్ అయినా హాట్ టాపిక్కే. తాజాగా సమంత నయా అవతార్ గురించి వేడి వేడిగా చర్చ జరుగుతోంది.
ఇంతకీ సమంత ఏం చేయబోతోంది.? అంటే, నిర్మాతగా మారబోతోంది. తన కొత్త ప్రొడక్షన్ హౌస్‌ని ప్రకటిస్తూ సమంత లోగో కూడా రిలీజ్ చేసింది. ‘ట్రాలాలా’ అనే పేరుతో తాను ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాననీ, అందులో రియాల్టీకి దగ్గరగా వుండే కథలను నిర్మిస్తాననీ సమంత చెప్పింది.
అలాగే, టాలెంట్ వున్న యంగ్ డైరెక్టర్లను ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ప్రోత్సహిస్తానని సమంత చెప్పుకొచ్చింది. ఈ మధ్యనే సమంత ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
తమిళంలో సమంత కోసం ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సిద్ధంగా వుందని ప్రచారం జరుగుతోంది. అయితే, సమంత నుంచి గ్రీన్ సిగ్నల్ రావల్సి వుందనీ, సమంత ఒప్పుకుంటే ఆ ప్రాజెక్ట్‌లో సమంత ఫిక్స్ అయినట్లే అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







