తాత్కాలికంగా సన్నగా కనిపించాలంటే ఏం చేయాలో చూద్దాం!
- May 27, 2016
బరువు తగ్గేందుకు వ్యాయామాలు, ఆహారంలో మార్పులు.. షరా మామూలే. కానీ వాటి వల్ల వెంటనే ఆహార్యంలో తేడా ఏమీ రాదు. మరి తాత్కాలికంగా సన్నగా కనిపించాలంటే ఏం చేయాలో చూద్దాం!
మీరెంచుకునేలో దుస్తులు మీకు సరిగ్గా సరిపోయేవై ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్త ముఖ్యంగా బ్రా విషయంలో తీసుకోవాలి. లోదుస్తులు ఏ మాత్రం సౌకర్యంగా లేకపోయినా, శరీరానికి ఆసరా ఇవ్వకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
*
దుస్తుల విషయానికి వస్తే.. వాటిని వేసుకునే ముందు అవి సరైన ఆకృతిలో ఉన్నాయా లేవా అన్నది ఒకటికి రెండుసార్లు గమనించుకోవాలి. చిన్నగా ఉన్నవీ, కాస్త బిగుతుగా ఉన్నవి కొవ్వు చేరిన భాగాన్ని ప్రస్ఫుటంగా కనిపించేలా చేస్తాయి. అలాగే వదులుగా, పెద్దగా ఉన్నవి ఇంకా లావుగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి ఈ రెండూ కాకుండా మీ శరీరాకృతికి సరిగ్గా నప్పే వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే వాటిని ఒకటికి రెండుసార్లు ధరించి చూసుకున్న మీదటే కొనుక్కోవాలి. కొన్ని దుస్తులు శరీరాకృతికి నప్పడం మాత్రమే కాదు, సన్నగానూ కనిపించేలా చేస్తాయి. అలాంటివి ఎంచుకోవాలి.
*
మీ అల్మారాలో నలుపు రంగు దుస్తులు కనీసం రెండు ఉండేలా చూసుకోవాలి. ఈ రంగు సన్నగా కనిపించేలా చేస్తుంది. ఒకవేళ మీరు మొత్తంగా నలుపు రంగు దుస్తులే వేసుకోవాలనుకుంటే.. చెప్పులూ, బెల్ట్, పర్సు.. ఇలా ఏదో ఒకటి వేరే రంగులో ఉండేలా చూసుకోవడం మంచిది. చిన్నచిన్న ప్రింట్లున్న దుస్తులను ఎంచుకోవాలి.
*
మీరు ఎంచుకునే దుస్తుల మెడ అడ్డంగా కన్నా పొడుగ్గా కుదిరితే ఆంగ్ల వి ఆకారంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే వెడల్పుగా, బోట్ తరహా మెడ మానేయాలి. ఇవి మిమ్మల్ని ఇంకాస్త వెడల్పుగా కనిపించేలా చేస్తాయి. చారలున్న దుస్తులు ఎంచుకుంటున్నప్పుడూ అంతే. నిలువుగీతలున్న ప్రింట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ, దుస్తులపై ఎంబ్రాయిడరీ, ఇతర అదనపు అలంకరణ ఏవి చేసినా.. అవి అడ్డంగా కన్నా నిలువుగా ఉండేలా చూసుకోవాలి.
*
జీన్స్ విషయానికి వస్తే.. అడుగున వెడల్పుగా ఉన్నవాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే స్ట్రెయిట్ లెగ్, బూట్‌కట్ తరహావి ఎంచుకోవాలి. దీనివల్ల ఆకృతి మొత్తం సన్నగా కనిపిస్తుంది. అదే స్కర్ట్‌లు ఎంచుకుంటుంటే ఆంగ్ల ఎ లైన్ ఉన్న వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి నడుము దగ్గర పట్టినట్లు ఉండి, అడుగున వెడల్పుగా కనిపిస్తాయి. మొత్తం మీద వీటిని ధరిస్తే శరీరాకృతి కచ్చితంగా సన్నగా కనిపిస్తుంది.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









