8 సంవత్సరాల తర్వాత సౌదీకి ఇరాన్ ఉమ్రా యాత్రికులు

- December 14, 2023 , by Maagulf
8 సంవత్సరాల తర్వాత సౌదీకి ఇరాన్ ఉమ్రా యాత్రికులు

టెహ్రాన్: ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఉమ్రా చేసేందుకు ఇరాన్ యాత్రికులు డిసెంబర్ 19న సౌదీ అరేబియాకు చేరుకుంటారు. ఈ విషయాన్ని ఇరాన్ హజ్ అండ్ తీర్థయాత్ర సంస్థ అధిపతి అబ్బాస్ హొస్సేనీ ప్రకటించారు. టెహ్రాన్‌లో మీడియాతో హోస్సేనీ మాట్లాడుతూ.. మొదటి బ్యాచ్‌లో 550 మంది యాత్రికులు ఉంటారని తెలిపారు. "యాత్రికులు డిసెంబర్ 19న మక్కాలోని దేవుని హౌస్‌కి వెళతారు. యాత్రికులు సౌదీ అరేబియాలో 10 రోజులు ఉంటారు. అందులో ఐదు రోజులు మక్కాలో.. ఐదు రోజులు మదీనాలో ఉంటారు." అని వివరించారు. మొత్తంగా ఈ సీజన్ లో 550 బ్యాచ్‌లలో మొత్తం 70,000 మంది ఇరాన్ యాత్రికులు ఉమ్రా చేస్తారని హోస్సేనీ చెప్పారు. పవిత్ర రమదాన్  మాసానికి ముందు ఫిబ్రవరి 29 వరకు ఉమ్రా యాత్రికులు ప్రయాణాలు ఉంటాయన్నారు. ఉమ్రా తీర్థయాత్రలో పాల్గొనేందుకు 5.7 మిలియన్ల మంది ఇరానియన్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇరాన్ - సౌదీ అరేబియా మార్చి 2023లో చైనా మధ్యవర్తిత్వ ఒప్పందం ద్వారా దౌత్య సంబంధాలను పునఃస్థాపించుకున్నాయి.  2016లో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com