వెనెజులాలో ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి
- December 14, 2023
వెనెజులా: వెనెజులాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. 17 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. వెనెజులాలోని ఓ హైవేపై బుధవారం ఓ ట్రక్కు అతివేగంగా వెళ్తూ అనేక కార్లను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బస్సు, పలు కార్లు సహా మొత్తం 17 వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష