గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం
- December 14, 2023
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం లభించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్లో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గవర్నర్ తొలి ప్రసంగం కాబట్టి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే అంశంపై దాదాపు గంటన్నర పాటు చర్చించారు. అదే సమయంలో ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? మున్ముందు ఎలా ఉండబోతుంది? అనే అంశాలతో గవర్నర్ ప్రసంగంలో ఉండనున్నట్లుగా సమాచారం.
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో రెండు గ్యారెంటీలలో కొన్ని అంశాలను అమలు చేస్తోంది. మిగతా గ్యారెంటీలపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. కాగా, ఈ నెల 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!







