‘బింబిసార’ మొదలయ్యేదెప్పుడంటే.!
- December 14, 2023
కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది ‘బింబిసార’. కోవిడ్ టైమ్‌లో లిమిటెడ్ సోర్సెస్‌తో తెరకెక్కిన ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. బ్రహ్మరథం పట్టారు.
మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంది ఈ సినిమా. ఈ సినిమాకి కొనసాగింపు వుండబోతోందనీ అప్పుడే చెప్పాడు. అలాగే, ‘బింబిసార 2’ పై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు కూడా.
‘బింబిసార’ మొదటి పార్ట్ ఇచ్చిన సక్సెస్ కిక్‌తో అప్పుడే రెండో పార్ట్ మొదలవుతుందనుకున్నారంతా. కానీ, ఆ తర్వాత ‘అమిగోస్’ అనే సినిమా చేశాడు కళ్యాణ్ రామ్. తొలి సినిమాకే ఆ రేంజ్ సక్సెస్ రావడంతో, ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే డైరెక్ట్ చేసే బంపర్ ఛాన్స్ దక్కించుకున్నాడీ సినిమా డైరెక్టర్ వశిష్ట.
సో, అలా అటు హీరో, ఇటు డైరెక్టర్ ఇద్దరూ వారి వారి ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ నుంచి ‘డెవిల్’ అనే సినిమా వస్తోంది. డిశంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా పైనా మంచి అంచనాలే వున్నాయ్. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో ‘బింబిసార 2’ అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఒత్తిడి తీసుకొస్తున్నారు.
దాంతో, అప్డేట్ ఇవ్వక తప్పలేదు కళ్యాణ్ రామ్‌కి. ఏప్రిల్, లేదా, మే నెలలో ‘బింబిసార 2’ స్టార్ట్ అవుతుందని ప్రత్యక్షంగా అనౌన్స్ చేశాడు కళ్యాణ్ రామ్. చూడాలి మరి.!
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







