సస్పెన్షన్‌కు గురైన ఎంపీల నిరసన..
- December 15, 2023
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో స్మోక్ అటాక్ ఘటనను ఖండిస్తూ ఆందోళన చేపట్టిన 14 మంది ఎంపీలను గురువారం సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్‌కు గురైన ఆ ఎంపీలు ఈరోజు పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. సస్పెండ్ అయినవారిలో 13 మంది లోక్‌సభలో, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఆ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు. ప్రజాస్వామ్యం డౌన్‌డౌన్ అన్న ప్లకార్డులు పట్టుకున్నారు. సైలెంట్ ప్రొటెస్ట్ టీషర్ట్ ను డెరిక్ ఒబ్రెయిన్ వేసుకున్నారు.
మరో వైపు నేడు ఉభయసభలు వాయిదాపడ్డాయి. లోక్‌సభ, రాజ్యసభ ప్రారంభంకాగానే.. విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో రెండు సభలను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన ఆదేశాలనే ప్రభుత్వం పాటిస్తోందని పార్లమెంటరీ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. స్మోక్ ఘటన అంశం ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు.
కాగా, పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన చేపడుతున్న సస్పెండ్ అయిన ఎంపీలను కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ కలిశారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!