ఏపీ విద్యార్థి ఐఎస్ఐఎస్ వీడియోలో

- May 28, 2016 , by Maagulf
ఏపీ విద్యార్థి ఐఎస్ఐఎస్ వీడియోలో

 ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులను తమవైపు ఆకర్షిస్తున్నారు. తాజాగా వారు విడుదల చేసిన ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. అమెరాకాలోని టెక్సాస్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థితో ఇండియాలో దాడులు చేస్తామని వీడియో రికార్డ్‌ చేసి విడుదల చేశారు. మే 19న విడుదల చేసిన ఈ 22 నిమిషాల నిడివి గల వీడియోను పరిశోధించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇందులో ఆరుగురు భారతీయ విద్యార్థులు ఉన్నట్టు వెల్లడించింది.ఇందులో ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన మహ్మద్ సాజిత్ అలియాస్ బాబా సాజిద్, ఫారూక్ అల్ హిందీ అలియాస్ అబురషీద్ ఉన్నారు. మహారాష్ట్రలోని కళ్యాణ్‌కు చెందిన అబు సల్హా అల్ హిందీ, ఫహద్ షేక్ అలియాస్ అబు అమర్ అల్ హిందీ, థానేకు చెందిన అమన్ తాండ్లే అలియాస్ అబు సల్మాన్ అల్ హిందీ, షాహామ్ థాంకీ ఉన్నారు. దీంతో ఐఎస్ఐస్ లోచేరిన భారతీయుల సంఖ్య 25 నుంచి 40 చేరింది. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని, ఐఎస్‌పై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com