భారత విదేశాంగ మంత్రితో సుల్తాన్ భేటీ
- December 16, 2023
న్యూ ఢిల్లీ: భారత్ లో పర్యటిస్తున్న హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ శుక్రవారం న్యూ ఢిల్లీలోని తన రెసిడెన్సీలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భాం ఒమన్, ఇండియా మధ్య ఉన్న అధునాతన సంబంధాలను, వాటిని వివిధ రంగాలలో ప్రోత్సహించే మార్గాలను వారు సమీక్షించారు. అలాగే ఉమ్మడి ఆందోళన కలిగించే ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో ఒమనీ వైపు నుండి విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ, భారతదేశంలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీ హాజరయ్యారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కాన్సులర్, పాస్‌పోర్ట్, వీసా & విదేశీ భారతీయ వ్యవహారాల కార్యదర్శి ముక్తేష్ పరదేశి, విదేశీ వ్యవహారాల శాఖ (గల్ఫ్ ప్రాంతం) జాయింట్ సెక్రటరీ అసీమ్ రాజా మహాజన్, ఒమన్‌లో భారత రాయబారి అమిత్ నారంగ్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!