సైనికుల ధైర్యం బహ్రెయిన్‌కు గర్వకారణం: ప్రిన్స్ సల్మాన్
- December 18, 2023
బహ్రెయిన్: ఆధునిక బహ్రెయిన్ రాష్ట్ర స్థాపనకు అమర సైనికుల సహకారం ఎంతో గొప్పదని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కీర్తించారు. అల్-సఖిర్ ప్యాలెస్‌లో హెచ్ఆర్హెచ్ ఆధ్వర్యంలో జరిగిన స్మారక దినోత్సవ వేడుకకు నిన్న సాయుధ దళాల సుప్రీం కమాండర్, డిప్యూటీ కింగ్, హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా తరపున హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ హాజరయ్యారు. అమర సైనికులు ధైర్యం అసమానమని, రాబోయే తరాలకు బహ్రెయిన్‌కు వారు గర్వకారణంగా ఉంటారని డిప్యూటీ కింగ్ పేర్కొన్నారు. జాతీయ భద్రత మరియు సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు వారు సదా సిద్ధంగా ఉంటారని కొనియాడారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూ, ధర్మం మరియు న్యాయమైన విలువల రక్షణ కోసం బహ్రెయిన్ లోపల లేదా విదేశాలలో తమ ప్రాణాలను త్యాగం చేసిన బహ్రెయిన్ సైనికులను స్మరించుకున్నారు. మరణించిన సైనికుల కుటుంబాలకు మద్దతు ఇవ్వడంలో బహ్రెయిన్ పౌరులు ఐక్యత, అంకితభావంతో పాటుపడటాన్ని హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్‌కు భూకేటాయింపు రద్దు









