బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్.! విన్నర్ ఉల్టా ఫుల్టా.!

- December 18, 2023 , by Maagulf
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్.! విన్నర్ ఉల్టా ఫుల్టా.!

మోస్ట్ పాపులర్ బుల్లితెర గేమ్ షో అయిన బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ తుది అంకం పూర్తయిపోయింది. విజేతగా సామాన్యుడు, రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్‌ని ప్రకటించారు.

ఈ సారి బిగ్‌బాస్ విజేతపై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు. అంచనాల్లేవ్. సీనియర్ నటుడు శివాజీ.. తనదైన ఆటిట్యూడ్, హుందాతనంతో ఈ సారి ఎక్కువ మార్కులు కొట్టేయడంతో ఆయనదే బిగ్‌బాస్ ట్రోఫీ అనుకున్నారు కానీ, దానిపైనా ఏమంత ఇంట్రెస్ట్ పెట్టలేదు.

అయితే, ఉల్టా ఫుల్టా బిగ్‌బాస్‌లో ఏదైనా జరగొచ్చు.. ముఖ్యంగా అనుకున్నది అయితే జరగనే జరగదు.. అనే స్లోగన్‌తో ఈ సారి సీజన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.

అందుకు తగ్గట్లుగానే ఏవేవో మార్పులు జిరిగాయ్ హౌస్‌లో. కొత్త వాళ్లు వచ్చారు. ఆల్రెడీ హౌస్‌లో వుండి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్లినవాళ్లు మళ్లీ వచ్చారు.. ఇలాంటివి చాలానే జరిగాయ్.

మొదట్లో ఒకట్రెండు ఎపిసోడ్లు ఇంట్రెస్టింగ్‌గా సాగిన బిగ్‌బాస్ షో, ఆ తర్వాత చప్పబడిపోయింది. ఎట్టకేలకు చివరి ఎపిసోడ్ వచ్చేసింది. విజేత ఎవరో తేలిపోయింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ కాగా, రన్నర్‌గా అమరదీప్ నిలిచాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com