తేజ సజ్జా.! నన్ను చిన్న చూపు చూడొద్దు ప్లీజ్.!

- December 20, 2023 , by Maagulf
తేజ సజ్జా.! నన్ను చిన్న చూపు చూడొద్దు ప్లీజ్.!

ఇంద్ర సేనా రెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పటి పాత్రలో  కనిపించి మెప్పించిన బుడ్డోడు తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితుడు. చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించాడు.

చిన్నతనం నుంచీ సినిమాల్లోనూ వుంటూ కష్టపడి హీరోగా ఎదిగాడు. ‘జాంబిరెడ్డి’ సినిమాతో హీరోగానూ ఓ మంచి హిట్ కొట్టేశాడు. ఇప్పుడు ‘హనుమ్యాన్’ గా రాబోతున్నాడు.
విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. 

రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ చూస్తే, ఇది హిట్టు బొమ్మ అని ఫిక్సయిపోయారో ఏమో.. రకరకాల ప్రశ్నలతో పాపం తేజ సజ్జాని వేధిస్తున్నారు.

ఈ సినిమాకి నీ స్టామినా సరిపోతుందా.? అంటూ అవమానపరిచేలా మాట్లాడుతున్నారు. దాంతో, బుడ్డోడు బాగా హర్ట్ అయ్యాడు. స్టార్ హీరోల వారసుల్ని కూడా ఇలాగే ప్రశ్నిస్తారా.?

చిన్నతనం నుంచీ ఎంతో కష్టపడి నేను ఈ స్టేజ్‌కి వచ్చాను. అదృష్టం కొద్దీ, నాకు ఈ సినిమా ఛాన్స్ దక్కింది. లక్కు బాగుండి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నటుడికి స్టామినాతో పనేముంది.? చిన్న హీరోలు పెద్ద సినిమాలు చేయడకూడదన్న రూలేమైనా వుందా.? పెద్ద సినిమాలన్నీ స్టార్ హీరోలూ, వారి వారసులే చేయాలా.? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ‘హనుమ్యాన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com