యువకునికి అండగా నిలిచిన 'ETCA' మహిళలు
- May 28, 2016
ETCA సేవ కార్యక్రమాల్లో మేము సైతం అంటూ అనారోగ్యంతో పని చేయలేక ఇబ్బందులు ఎదురుకొంటున్న యువకునికి ఆపన్న హస్తం అందించిన ETCA మహిళా విబాగం.
భవిష్యత్ లో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ సామాజిక సేవ కార్యక్రమాలను విస్తృతం చేసి ETCA పటిష్టతకు , ఔన్నత్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తామని వెల్లడించిన మహిళా సభ్యులు.
వివరాలు :
పేరు తిరుసు శ్రీధర్ వయస్సు 20 సంవత్సరాలు , డిచ్ పల్లి , జిల్లా నిజామబాద్ కు చెందిన యువకుడు 40 రోజుల క్రింద వెల్దర్ వీసా పై అజ్మాన్ లోని ఒక ప్రైవేటు కంపనీలో రావడం జరిగింది , వచ్చిన తరువాత అనారోగ్యంతో బాధపడుతూ పనిచేయలేక ఇంటికి పంపమని యాజమాన్యాన్ని కోరడం జరిగింది . శ్రీధర్ అభ్యర్థనను తిరస్కరించడంతో మరియు కొంచెం కఠినంగా వ్యవహరించడంతో మానసిక వ్యధకు గురి అయిన యువకుడు సమచారాన్ని ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలయచేయడం జరిగింది . ఇబ్బంది పడుతున్న యువకుని పరిస్థితిని కొందరు డాక్టర్ ఎల్లాల శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకవెల్లగా వెంటనే స్పందించిన డాక్టర్ ETCA సభ్యులకు సమాచారాన్ని అందచేయడం జరిగింది. వెంటనే స్పందించిన ETCA సభ్యులు రవి ఊట్నురి, బాబు స్వామి,రాజ శేకర్ తోట బాదితుడి కంపెనీ కి వెళ్లి శ్రీధర్ కు నచ్చచెప్పి కావాల్సిన ఆర్ధిక సహాయాన్ని అందించి పరిస్థితిని అధ్యక్ష్యుడు పీచర కిరణ్ కుమార్ దృష్టికి తీసుకవెల్లడం జరిగింది . కంపెనీ యాజమాన్యంతో ఫోనులో మాట్లాడిన కిరణ్ వాస్తవ పరిస్థితులను తెలుసుకొని ఫ్రీ వీసా ఇచ్చిన యాజమాన్యనికి, అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని ఆఫీసు బాయ్ పని కల్పించిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపి బాదితుడి అనారోగ్య పరిస్థితిని వారికి తెలియచేసి, వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లను సమకురస్తామని చెప్పి, విషయాన్ని మహిళా విబాగ సభ్యులకు వాట్సప్ గ్రూప్ ద్వార తెలియ పరచడం జరిగింది .
వెంటనే స్పందించిన మహిళా సభ్యులు విరాళాలు ప్రోగు చేసి బాదితుడు ఇండియా వెళ్ళడానికి కావలసిన విమాన టికెట్ ను సమకూర్చి , 40 రోజుల్లో శ్రీధర్ కోసం వెచ్చించిన మెస్ ఖర్చుని , తీసుకున్న అడ్వాన్సు డబ్బులను, ఇతర ఖర్చులను కంపెనీ కి చెల్లించి స్వదేశానికి పంపడానికి సహయం అందించడం జరిగింది . మానవత హృదయంతో స్పందించిన మహిళ సభ్యులను ETCA కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు ప్రశంసించారు .
నోట్ : దయచేసి గల్ఫ్ దేశాలకు వచ్చే ముందు అన్ని విషయాలు ఆలోచించుకొని, జీవన స్థితి గతులను తెలుసుకొని , పని చేయగల సామర్థ్యం ఉన్నవారు మాత్రమే రావాలని, అవగాహన లేక వచ్చి పని చేయలేక వెల్లిపోతామంటే ఈ కంపెనీ యాజమాన్యం వలే అన్ని కంపెనీ యాజమాన్యాలు సహకరించవని, సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, అందరికి ఇబ్బందులు ఏర్పడే అవకశాలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది .
ETCA మహిళా సభ్యులు గత రెండు సంవత్సరాలుగా సంఘ అభ్యున్నతి కోసం కలిసికట్టుగా కృషిస్తున్నారని , సేవ కార్యక్రమాల్లో సైతం భాగస్వామ్యులు అవడం అభినందనీయమని, సహకరించిన సభ్యులందరికీ కిరణ్ కుమార్ కృతజ్ఞతలు తెలియచేసారు .
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









