ఖతార్ యూనివర్సిటీలో 2024 సెమిస్టర్ ప్రవేశాలు ప్రారంభం
- December 24, 2023
దోహా కతార్ విశ్వవిద్యాలయం (QU) రాబోయే 2024 సెమిస్టర్ కోసం అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అడ్మిషన్ డిపార్ట్‌మెంట్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. వివిధ విభాగాలలో ఉన్న విభిన్న రకాల ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 29, 2024 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. కోర్సులు, ఫీజుల సమాచారం కోసం అధికారిక QU వెబ్‌సైట్(www.qu.edu.qa ) సందర్శించాలని వర్సిటీ అధికారులు కోరారు.
ఫాల్ 2024 సెమిస్టర్ కోసం కాబోయే విద్యార్థులు ఎంచుకోవడానికి 67 ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో PhD మరియు మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు, కాలేజ్ ఆఫ్ షరియా మరియు ఇస్లామిక్ స్టడీస్‌లోని ఖురాన్ సైన్సెస్ ప్రోగ్రామ్‌లో PhD వంటి సమగ్రమైన ఆఫర్‌లు ఇందులో ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కోసం మాస్టర్స్ మరియు సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లు, హెల్త్ సైన్సెస్‌లో హెల్త్ ప్రొఫెషన్స్ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికేట్ మరియు బయోమెడికల్ సైన్సెస్‌లో మాస్టర్స్, గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లు, జెనెటిక్ కౌన్సెలింగ్, పబ్లిక్ హెల్త్, కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్‌లో హ్యూమన్ న్యూట్రిషన్ అందుబాటులో ఉన్నాయి. కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మాస్టర్ ఇన్ ఫార్మసీ మరియు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. కాలేజ్ ఆఫ్ బిజినెస్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA), మాస్టర్ ఆఫ్ అకౌంటింగ్ (MAC), మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫైనాన్స్ (MSc ఫైనాన్స్), మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ మార్కెటింగ్ (MSc మార్కెటింగ్), మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ వంటి ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ప్రోగ్రామ్‌లలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్‌షిప్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ కరికులమ్, ఇన్‌స్ట్రక్షన్స్ మరియు అసెస్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమాలతో పాటు ప్రాథమిక విద్య, సెకండరీ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ మరియు ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. 2024 సెమిస్టర్‌కి సంబంధించిన తరగతులు ఆగస్టు 25, 2024న ప్రారంభం అవుతాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!