దుబాయ్ లో కొత్తగా 700కి పైగా మోడ్రన్ బస్ షెల్టర్లు
- December 25, 2023
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఎమిరేట్ అంతటా కీలక ప్రదేశాలలో 762 పబ్లిక్ బస్ షెల్టర్లను నిర్మించనుంది. అధికారిక ప్రాజెక్ట్ ప్లాన్ ప్రకారం, అన్ని బస్ షెల్టర్లను 2025 నాటికి పూర్తి చేయనున్నారు. RTA సంస్థ సహకారంతో ట్రయల్ బేస్‌లో కొన్ని షెల్టర్ల నిర్మాణంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్, మత్తర్ అల్ తాయర్ మాట్లాడుతూ.. ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి మరియు వినియోగదారుల సంతృప్తిని మెరుగుపరచడానికి అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ బస్ షెల్టర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ ప్రారంభించిన "మై కమ్యూనిటీ... ఎ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్" ఇనిషియేటివ్‌కు మద్దతు ఇస్తుందన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!