ఫిబ్రవరిలో అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న భారత ప్రధాని మోదీ

- December 26, 2023 , by Maagulf
ఫిబ్రవరిలో అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న భారత ప్రధాని మోదీ

యూఏఈ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో అబుదాబిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆరోజు ఫిబ్రవరి 14న ఉదయం ఏడుగురు దేవతలను ప్రతిష్ఠించి ప్రత్యేక ప్రార్థనలలు నిర్వహించనున్నారు.  కాగా సాయంత్రం జరిగే సమర్పణ కార్యక్రమానికి మోదీ హాజరు కానున్నట్లు ఆలయ నిర్మాణ సంస్థ బాప్స్ స్వామినారాయణ్ సంస్థ తెలిపింది. దుబాయ్ -రాజధాని మధ్య ప్రధాన మోటర్‌వే నుండి అబుదాబిలోని అబు మురీఖా ప్రాంతంలో ఉన్న యూఏఈ మొట్టమొదటి హిందూ దేవాలయం ఫిబ్రవరి 18నండి ప్రజలకు అందుబాటులోకి రానుంది. పింక్ ఇసుకరాయి, తెల్లని పాలరాయితో అద్భుతమైన శిల్పాలను ఏర్పాటుచేశారు. వీటి నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. దేవాలయం ఇది ఒక అద్భుతమని, ఎడారిలో కమలం వికసించినట్లు కనిపిస్తుందని బాప్స్ స్వామినారాయణ్ సంస్థ ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహారాజ్ తెలిపారు. "ఫిబ్రవరి 14 ఉదయం, మూర్తి (విగ్రహాలు) యొక్క మూర్తి ప్రతిష్ఠ లేదా ఆవాహన ఉంటుంది. సాయంత్రం, భారత ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బహిరంగ సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము" అని ఆలయ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రణవ్ దేశాయ్ చెప్పారు.  ఎమిరేట్స్‌ను ప్రతిబింబించేలా ఏడు గోపురాలతో కూడిన స్మారక చిహ్నాన్ని చూపించే మొదటి మోడల్‌ను 2018లో మోదీ వెల్లడించినప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

 ఏడు శిఖరాలు, ఏడు ఎమిరేట్స్ చిహ్నంగా ఆలయ గోపురాలను తీర్చిదిద్దారు. ఏడు గోపురాలకు భారతదేశం యొక్క ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పశ్చిమం నుండి దేవతా విగ్రాహాలను ప్రతిష్టించనున్నారు. "అరబిక్ ప్రాంతం, చైనీస్, అజ్టెక్ మరియు మెసొపొటేమియా నుండి 14 విలువైన కథలకు సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేయనున్నారు.  ఈ ఆలయంలో 8,000 నుండి 10,000 మంది ప్రజలు ఒకేసారి దర్శించుకునే అవకాశం ఉంటుంది. గంగా, యమునా మరియు సరస్వతి అనే మూడు పవిత్ర నదుల సంగమం మీద ఈ ఆలయం నిర్మించబడినట్లుగా ఉంటుంది.  అయోధ్య నగరి (పట్టణం) మొత్తం ఒకే రాతి నిర్మాణంలో 3D ఆకృతిలో చెక్కబడిందని ఆలయ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రణవ్ దేశాయ్ చెప్పారు.  భారతదేశంలోని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని 2,000 కంటే ఎక్కువ మంది కళాకారులు గత మూడు సంవత్సరాలుగా 402 తెల్లని పాలరాతి స్తంభాలపై చిత్రకళను చెక్కారు. వీటి కోసం గత మూడేళ్లలో 700 కంటే ఎక్కువ కంటైనర్లలో 20,000 టన్నులకు పైగా రాయి, పాలరాయిని అబుదాబికి తరలించారు. ప్రార్థనా మందిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి కమ్యూనిటీ సెంటర్, లైబ్రరీ, పిల్లల పార్కు మరియు యాంఫిథియేటర్  వంటివాటిని ఆలయ సముదాయంలో ఏర్పాటు చేయనున్నారు.  ఫిబ్రవరి 10 నుంచి ఆలయంలో ప్రార్థనా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.  చర్చిలు,  సిక్కు గురుద్వారా ఉన్న దుబాయ్‌లోని జెబెల్ అలీ ప్రాంతంలో గత సంవత్సరం ఒక చిన్న ఆలయాన్ని ప్రారంభించారు. బాప్స్ సంస్థ భారతదేశం, యూకే, యూఎస్, కెన్యా, దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియాలో సుమారు 1,200 దేవాలయాలను నిర్మించింది. ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ అబుదాబి క్రౌన్ ప్రిన్స్‌గా ఉన్నప్పుడు 2015లో భారతీయ సమాజానికి ఇచ్చిన 5.4 హెక్టార్ల కంటే ఎక్కువ స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com