‘స్పిరిట్’కి ఊపొచ్చింది.!
- December 26, 2023
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రబాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సి వుంది. ఆ సినిమాకి ‘స్పిరిట్’ అని టైటిల్ ఎప్పుడో ఫిక్స్ చేసేశాడు సందీప్ రెడ్డి వంగా.
ఇంతవరకూ ‘యానిమల్’ సినిమాతో బిజీగా వుండిపోయాడు. అలాగే, ప్రబాస్ కూడా ‘సలార్’ కోసం డేట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇద్దరూ ఖాళీ అయ్యారు. సో, ఇక నుంచి ‘స్పిరిట్’ని రంగంలోకి దించాలని అనుకుంటున్నారట.
మే నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ వుండబోతున్నాయని అంటున్నారు. అయితే అంతకు ముందే ఈ సినిమాకి ప్రి ప్రొడక్షన్ పనులు మొదలెట్టాలని అనుకుంటున్నారట.
ఇంత ఊపు రావడానికి కారణం అటు సందీప్ రెడ్డికి ‘యానిమల్’ హిట్టు, ఇటు ప్రబాస్‌కి ‘సలార్’ హిట్టే. ఇద్దరూ మంచి జోరు మీదున్నారు. ఇదే జోరులో ‘స్పిరిట్’ కూడా కానిచ్చేయాలనుకుంటున్నారు
ఏమో, అన్నీ అనుకున్నట్లు జరిగితే, త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన తాజా ప్రాజెక్ట్ పూర్తి వివరాలు వెల్లడి అవుతాయ్.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..