బీట్ రూట్ జ్యూస్ ఇలా చేసుకుని తాగితే ఆరోగ్యం మీ సొంతం.!
- December 26, 2023
బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. హెమోగ్లోబిన్ పెంచడంలో తోడ్పడుతుంది. అలాగే బీట్రూట్లోని పోషకాలు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయ్.
అందుకే అప్పుడప్పుడూ అయినా బీట్రూట్ తింటుండాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, బీట్రూట్ని షుగర్, మిల్క్ కలిపి జ్యూస్‌లా చేసి తాగుతుంటారు. కొందరు లెమన్ కూడా మిక్స్ చేసుకుని జ్యూస్ చేస్తుంటారు.
ఇలా చేసుకుని తాగడం మంచిదే. అలాగే కొందరు కూరలా, మరికొందరు పచ్చడిలానూ చేసుకుని తింటుంటారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా బీట్ రూట్‌ని వాడితే బోలెడంత ఆరోగ్యం మన సొంతమవుతుంది.
తురిమిన బీట్రూట్కి కాస్త అల్లం చేర్చి, అందులోనే పచ్చి పసుపు కొమ్ము తురుము కూడా కొద్దిగా వేసి, తగినంత వాటర్‌తో జ్యూస్‌లా చేసి తాగితే చాలా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు బీట్రూట్లోని పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయ్. శరీరానికి తగినంత ఐరన్ అందుతుంది. తద్వారా రక్త హీనత రాకుండా వుంటుంది. సీజనల్‌గా సోకే ఫ్లూ తదితర అనారోగ్య సమస్యలు దరి చేరకుండా వుంటాయ్.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!