ఏపీ ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ కీలక సమావేశాలు
- December 26, 2023
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో జనసేన నుంచి కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక సీట్లు కేటాయించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం.
జనసేన గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలపై పవన్ ఇప్పటికే సర్వే చేయించారు. ఆ స్థానాల్లో జనసేన అనుసరించాల్సిన వ్యూహాలను కూడా రచించుకున్నారు. ఇప్పటికే మొదటి విడత అభ్యర్థుల ఎంపిక కోసం సమీక్షలు పూర్తి చేశారు. కృష్ణా, గుంటూరు, ఒంగోలు, రాయలసీమ స్థానాల్లో జనసేన అభ్యర్థులపై పవన్ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు రెండవ విడతలో గోదావరి జిల్లాల అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో కాకినాడలో గోదావరి జిల్లాల అభ్యర్థుల ఎంపికపై సమీక్ష నిర్వహించనున్నారు. జనసేన పార్టీ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనుకుంటోంది.
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా జనసేన నేతలతో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. ఇటీవల నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు, ఏపీ సీఎం అభ్యర్థి వంటి అంశాలపై కూడా తమ నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!