ఇజ్రాయెల్ ఎంబసీ వెనుక పేలుడు
- December 26, 2023
న్యూ ఢిల్లీ: న్యూ ఢిల్లీ లోని ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయం దగ్గర పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఎంబసీ వెనుక ఖాళీ ప్రాంతంలో పేలుడు శబ్ధం విన్పించింది. వెంటనే అప్రమత్తమైన ఎంబసీ సిబ్బంది పోలీసులకు సమాచారమందించారు. రాజధానిలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక పేలుడు సంభవించిందని మంగళవారం అగ్నిమాపక దళ విభాగానికి ఒక వ్యక్తి ఫోన్ చేయడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ దర్యాప్తు ప్రారంభించింది. పేలుడు ప్రదేశాన్ని పరిశీలించారు పోలీసులు. అక్కడికి అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు వ్లెలడించారు.
ప్రస్తుతం పేలుడు జరిగినట్టుగా వచ్చిన ఫోన్ కాల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు అధికారులు. కాల్ చేసింది ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేశారనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంటోందని సమాచారం. దీంతో పాటు సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా మరింత అలర్ట్ అయ్యాయి. అగ్నిమాపక, ఇతర భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం హై సెక్యూరిటీ జోన్‌లో ఉంది. రాయబార కార్యాలయానికి సంబంధించిన పరిసర ప్రాంతాలను పోలీసులు చుట్టుముట్టారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.. అయితే సరిగ్గా ఏమి జరిగిందో ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. ఏది ఏమైనప్పటికీ, హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుండి ఎంబసీ చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!