డీఎంకే అధినేత సినీ నటుడు విజయ్ కాంత్ మృతి..!!

- December 28, 2023 , by Maagulf
డీఎంకే అధినేత సినీ నటుడు విజయ్ కాంత్ మృతి..!!

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు..DMK అధినేత విజయ్ కాంత్ కు తాజాగా కరోనా సోకిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ అధినేత ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. శ్వాస సమస్య కారణంగా విజయకాంత్ ను ప్రస్తుతం వెంటిలేటర్ పైన మంచి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపింది.. గత కొన్నేళ్లుగా ఈయన పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వీటికి తోడు ఇప్పుడు కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన విజయ్ కాంత్ అభిమానులు..DMK నేతలు సైతం ఆందోళన చెందుతున్నారు.

గత కొన్నేళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న విజయకాంత్ పలు రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 18న జలుబు దగ్గు గొంతు నొప్పి కారణంగా వైద్య పరీక్షలు నిమిత్తం చెన్నైలో హాస్పిటల్లో చేర్పించారు దీంతో వైద్యులు కృత్రిమ శ్వాసను కూడా అందించారు. నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలియజేస్తూ డిసెంబర్ 11న ఆయనను డిశ్చార్జ్ చేశారు. అయితే ఇప్పుడు కరోనా సోకినట్లుగా డీఎంకే ప్రధాన కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలుబడడంతో విజయ కాంత్ ను హుటాహుటిక ఆసుపత్రికి తరలించారు.

నటుడు డీఎంకే అధినేత విజయకాంత్ మృతిని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రెటరీ ప్రకటించడం జరిగింది చెన్నైలో మెమోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈయన మరణించినట్లుగా సమాచారం. 1952 ఆగస్టు 25న ఈయన జన్మించారు.. విజయ్ కాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజున ఈయన తుది శ్వాస ఏడ్చినట్లు తెలుస్తోంది. విజయ్ కాంత్ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.. 2005 సెప్టెంబర్ 14న విజయ్ కాంత్ డిఎంకె పార్టీని ఏర్పాటు చేశారు. ఈ విషయంతో అభిమానులు తల్లడిల్లిపోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com