అమెరికా తెలుగు అసోసియేషన్(ATA) ఆధ్వర్యంలో తెలంగాణలో భారీ ఉచిత వైద్య శిబిరం
- December 28, 2023
తెలంగాణ: ఆటా వేడుకలు, సేవా కార్యక్రమాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పేదవాళ్లకు తమ వంతు సహాయం చేసే లక్ష్యంతో ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, యశోద హాస్పిటల్స్, ప్రతిమ హాస్పిటల్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్, ఇతర స్వచ్చంధ సేవ సంఘాల సహకారంతో స్థానికులు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి సూచనలతో సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో గల మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే మెగా ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి హాజరైన ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా మాట్లాడుతూ...అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుంది అన్నారు. నిరుపేద కుటుంబాలకు వైద్యం అందించడమే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఆటా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు.వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందచేస్తున్నమన్నారు. ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్, గుండె సంబంధిత, చర్మ, కంటి, దంత, ఆర్థోపెడిక్, గైనిక్, యూరో, జనరల్ సర్జరీ, క్యాన్సర్ స్క్రీనింగ్ సమస్యలపై వైద్యులు తమ వైద్యాన్ని అందిస్తున్నారు అన్నారు. ఇదే సందర్భంలో ఉచిత వైద్య శిబిరం తమ ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు ప్రజా ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.కాగా ఈ ఉచిత వైద్య శిబిరంలో రక్త పరీక్షలు కూడా చేశారు. అధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు ఉచితంగా మందులు పంపిణీ, వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆటా వ్యవస్థాపకులు హన్మంత్ రెడ్డి, ఆటా ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సూధిని, పాస్ట్ ప్రెసిడెంట్ పరమేష్ భీమ్ రెడ్డి, ట్రస్టీస్ కాశీ కొత్త, నరసింహ రెడ్డి ద్యాసాని, శ్రీధర్ కంచనకుంట్ల, ఆటా లిటరరీ చైర్ వేణు నక్షత్రం, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్, ఇతర స్వచ్చంధ సేవ సంఘాల ప్రతినిధులు, భారీ ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!