ఆ దర్శకుడి విషయంలో కళ్యాణ్ రామ్ అలా చేశాడా.?
- December 28, 2023
కళ్యాణ్ రామ్ తాజా సినిమా ‘డెవిల్’కి సంబంధించి మరో కాంట్రవర్సీ తెరపైకి వచ్చింది. ఈ సినిమాకి అభిషేక్ నామా నిర్మాత. కానీ, ఈయనే ఇప్పుడు దర్శకుడి లిస్టులో చెలామనీ అవుతున్నాడు.
అసలు దర్శకుడి పేరు కూడా బయటికి రానీయకుండా చేస్తున్నారు. అసలు ‘డెవిల్’ ఒరిజినల్ డైరెక్టర్ నవీన్ మేడారం. కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక ఈయన్ని పక్కన పెట్టేసి అభిషేక్ నామానే దర్శకుడయిపోయారు.
ఆయన నిర్మాత అన్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద నిర్మాత కూడా. కానీ, నవీన్ మేడారం కొత్త దర్శకుడు. ఇప్పుడిప్పుడే ఇండస్ర్టీకి పరిచయం కావల్సి వుంది.
ఈ సినిమా హిట్ అయితే, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మాదిరి పేరు తెచ్చుకోగల సత్తా వున్న దర్శకుడు. కానీ, మధ్యలోనే అన్యాయం జరిగింది.
‘కథ నాది.. సినిమాలోని ప్రతీ సీన్ కోసం ఎంతో కష్టపడి పని చేశా.. కానీ, చివరికి వచ్చేసరికి నా పేరు లేకుండా చేశారు..’ అంటూ దర్శకుడు నవీన్ మేడారం తాజాగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సోషల్ మీడియా వేదికగా.
కొత్త దర్శకుడు కాబట్టి నవీన్‌ని తొక్కేశారా.? అభిషేక్ నామా వంటి పెద్ద నిర్మాతతో నవీన్ ఫైట్ చేయలేడు. కొత్త దర్శకుల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేసే కళ్యాణ్ రామ్ కూడా ఇలా చేయడం ఏమంత బాగాలేదు.. అంటూ కొందరు నవీన్ మేడారంకి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!