విశ్వంభరుడికి జోడీ ఎవరబ్బా.!

- December 28, 2023 , by Maagulf
విశ్వంభరుడికి జోడీ ఎవరబ్బా.!

‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. అప్పుడే మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుందని సమాచారం.

అయితే, మొదటి షెడ్యూల్‌ని హీరో మెగాస్టార్ చిరంజీవి లేకుండానే చిత్రీకరించారట. సినిమాకి సంబంధించిన కీలక పాత్రల షూటింగ్ మొత్తం ఫస్ట్ షెడ్యూల్‌లో కానిచ్చేశారట.

ఇక, రెండో షెడ్యూల్‌కి ‘విశ్వంభర’ టీమ్ సిద్ధమవుతోంది. వచ్చే నెల నుంచి అంటే, కొత్త సంవత్సరంలో ‘విశ్వంభర’ రెండో షెడ్యూల్‌కి సన్నాహాలు జరుగుతున్నాయట.

ఈ షెడ్యూల్‌లో చిరంజీవి సహా హీరోయిన్ కూడా పాల్గొనే అవకాశాలున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.

అయితే, ఇంతవరకూ ఈ సినిమాకి హీరోయిన్ ఫిక్స్ కాలేదు. పలానా హీరోయిన్ అట.. అంటూ సీనియర్ ముద్దుగుమ్మలు త్రిష, నయన తార, అనుష్క తదితర హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయంతే.

కానీ, వీరిలో ఎవరు ఫిక్స్ అయ్యారన్నది ఇంతవరకూ సస్పెన్సే. కొత్త ఏడాదిలో ఖచ్చితంగా హీరోయిన్‌ని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అన్నట్లు ఈ సినిమాలో ఒక్క హీరోయిన్ కాదు, ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు వుండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com