ఐఎస్ఐఎస్ ఆత్మాహుతి దాడి లో ఇద్దరు భారతీయులు మృతి
- June 28, 2015
కువైట్ లో ఉగ్రదాడి మృతులకు శనివారం సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం కువైట్ సిటీ: కువైట్ లోని ఇమామ్ సిద్దీఖీ మసీదు వద్ద గత శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతిదాడిలో మరణించినవారిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ సుల్తాన్ పూర్ జిల్లా వలీపూర్ నకు చెందిన రిజ్వాన్ హుస్సేన్ (31) మసీదులో వాచ్ మన్ గానూ, అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్ పూర్ నకు చెందిన ఇబ్నే అబ్బాస్ (25) డ్రైవర్ గానూ కువైట్ లో పనిచేస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల కోసం వారు మసీదుకు వెళ్లినప్పుడు పేలుడు సంభవించి మరణించారు. ఈ ఇరువురు సహా మొత్తం 26 మంది ఈ ఘటనలో దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న 200 మందిలోనూ పలువురు భారతీయులు ఉన్నారని, వారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదిస్తున్నామని కువైట్ లో భారత దౌత్యవేత్త సునీల్ జైన్ చెప్పారు. కుటుంబసభ్యుల కోరిక ప్రకారం హుస్సేన్, అబ్బాస్ ల మృతదేహాలకు ఇరాక్ లోని పవిత్ర నజాఫ్ నగరంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా, మసీదులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సౌదీ అరేబియా జాతీయుడని తెలిసింది.
(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









