ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ.55 లక్షలు అందించిన పవన్
- December 31, 2023
కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ.55 లక్షలు అందించారు. కాకినాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 11 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందించారు.
ఆయా కార్యకర్తల మృతికి దారితీసిన కారణాలు తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులకు పవన్ ధైర్యం చెప్పారు. జనసేన అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగా ఉండాలన్న ఆలోచనతోనే పార్టీ క్రియాశీలక సభ్యులకు బీమా చేయించామని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..