న్యూఇయర్ వేడుకల నుంచి వస్తుండగా.. కారు ఢీకొని ఐదుగురు మృతి

- January 03, 2024 , by Maagulf
న్యూఇయర్ వేడుకల నుంచి వస్తుండగా.. కారు ఢీకొని ఐదుగురు మృతి

యూఏఈ: నూతన సంవత్సర వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యూఏఈలోని ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. అజ్మాన్‌లో జరిగిన ప్రమాదంలో ఎమిరాటీ దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు మరియు మేనకోడలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు బాలికలకు గాయాలైనట్లు చెప్పారు. జనవరి 1( సోమవారం) తెల్లవారుజామున అజ్మాన్‌లోని మాస్‌ఫుట్ ప్రాంతంలో ఎమిరాటీ కుటుంబం వాహనం ట్రక్కును ఢీకొట్టింది.  దుబాయ్‌లోని హట్టా నుండి వారు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com