అయోధ్య రామాలయం, యోగి ఆదిత్యనాథ్‌కు బాంబు బెదిరింపు
- January 04, 2024
అయోధ్య: అయోధ్యలోని రామాలయంపై, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై బాంబులు వేసి పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. బాంబు బెదిరింపులకు పాల్పడిన ఇద్దరినీ యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యూపీ ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసిన వారి పేర్లు తహద్ సింగ్, ఓంప్రకాష్. జుబేర్ అనే హ్యాండిల్ నుంచి ఈ బెదిరింపు వచ్చింది. నిందితులిద్దరూ గోండా వాసులని పోలీసులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం లక్నోలోని గోమతి నగర్‌లోని విభూతి ఖండ్ ప్రాంతానికి చెందిన తాహర్ సింగ్, ఓంప్రకాష్ మిశ్రాను అరెస్టు చేసింది.
ఈమెయిల్ ఐడీల సాంకేతిక విశ్లేషణ తర్వాత తాహర్ సింగ్ వేరే పేర్లతో ఈమెయిల్ ఖాతాలను సృష్టించారని, ఓంప్రకాశ్ మిశ్రా బెదిరింపు సందేశాలు పంపారని తేలింది. వీరిద్దరూ పారామెడికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారని సమాచారం. అయోధ్యలో రామాలయం ప్రారంభించనున్న నేపథ్యంలో పేల్చివేస్తామని బెదిరింపులు రావడంతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..