మొటిమల వల్ల కలిగే గుంతలు తగ్గాలంటే.!

- January 04, 2024 , by Maagulf
మొటిమల వల్ల కలిగే గుంతలు తగ్గాలంటే.!

హర్మోన్స్ అసమతుల్యం వల్ల కొందరికి మొటిమలు అధికంగా వస్తాయ్. వాటిని చేతితో గిల్లడం.. పిన్నులతో గుచ్చి లోపలి వ్యర్ధాన్ని బయటికి తీయడం వంటివి చేస్తుంటారు.
తద్వారా ఆ ప్లేస్‌లో గుంతలు ఏర్పడతాయ్. అధికంగా మొటిమలు వచ్చే వారిలో ఈ గుంతలు కూడా అధికంగానే ఫామ్ అవుతుంటాయ్.

దాంతో, ముఖం అంతా అంద వికారంగా తయారవుతుంది. ఆ గుంతలు రాకుండా వుండాలన్నా.. లేదంటే, వచ్చిన గుంతల్ని తగ్గించుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.

విటమిన్ ఎ, విటిమిన్ సి సరిపడినంత తీసుకుంటే.. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌ని నియంత్రించుకోవచ్చు. ఆటోమెటిగ్గా మొటిమలు రావడం తగ్గుతాయ్. క్యారెట్, బీట్ ‌రూట్, పుదీనా, కొత్తి మీరను అధికంగా మన డైట్‌లో తీసుకోవడం వల్ల కావల్సినంత విటమిన్ ఎ శరీరానికి అందుతుంది.

వీటిని జ్యూస్ రూపంలో తీసుకుంటే అది కూడా ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని చెబుతున్నారు.

అలాగే, కమల పండు (ఆరెంజ్), బత్తాయి, నిమ్మ జాతి పండ్లను కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల విటమిన్ సి లభిస్తుంది. వీటి వల్ల వచ్చిన మొటిమలు తగ్గడంతో పాటూ, భవిష్యత్తులోనూ వాటి బెడద తక్కువగా వుంటుంది. అలాగే, వీటిని తీసుకోవడం వల్ల చర్మానికి ఇన్‌ఫ్లామేషన్ జరిగి, మొటిమల వల్ల చర్మంపై ఏర్పడిన గుంతలు కూడా క్రమంగా తగ్గిపోతాయ్.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com