వైద్య పరీక్షల కోసం ఎలక్ట్రానిక్ సర్టిఫికేషన్ సర్వీస్
- January 07, 2024
మస్కట్: గల్ఫ్ హెల్త్ కౌన్సిల్‌కు గుర్తింపు పొందిన కేంద్రాలను కలిగి ఉన్న జీసీసీ దేశాల నుండి వైద్య పరీక్షల కోసం ఎలక్ట్రానిక్ సర్టిఫికేషన్ సేవను యాక్టివేట్ చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సర్వీస్ జనవరి 7నుండి అందుబాటులోకి వస్తుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మినిస్ట్రీ మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షా కేంద్రాలకు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ హెల్త్ పోర్టల్‌లో లేదా సనద్ కార్యాలయాల ద్వారా ఈ సేవ అందుబాటులో ఉంటుంది. జనవరి 7 కు ముందు పరీక్షల ఆమోదం పొందిన సందర్శకులు తమ దరఖాస్తును జనవరి 21 వరకు సమర్పించాలని, ఈ తేదీ తర్వాత మంత్రిత్వ శాఖ మాన్యువల్‌గా ఆమోదించబడిన పరీక్షలను స్వీకరించదని పేర్కొంది. మరింత సమాచారం కోసం మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్ నంబర్ 22702999లో సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..