లక్షద్వీప్ ఉండగా ఈ దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- January 07, 2024
న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన పై మాల్దీవుల మంత్రి జహీద్ రమీజ్ చేసిన కామెంట్లు వివాదం రేపుతున్న వేళ దీని పై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దేశ ప్రజలు లక్షద్వీప్‌కు వెళ్లి ఎంజాయ్ చేయాలని ఆయన సూచించారు.
‘పర్యాటకులు న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. లక్షద్వీప్‌లోనే అన్నీ ఉన్నాయి. టూరిజంలో లక్షద్వీప్ అద్భుతమైన ప్రదేశం. ఇటీవలే ప్రధాని మోదీ కూడా అక్కడకు వెళ్లారు. పర్యాటకులకు ఇదో చక్కని గమ్యస్థానం. అక్కడ విమానాశ్రయం ఉండాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేరళ నుంచి లక్షద్వీప్ కు వెళ్లేందుకు సౌకర్యాలు ఉన్నాయి’ అని కిషన్ రెడ్డి చెప్పారు.
నరేంద్ర మోదీ లక్షద్వీప్ ను సందర్శించినప్పటి నుంచి ఆ ప్రాంతం గురించి గూగుల్లో పర్యాటకులు బాగా వెతుకుతున్నారు. అత్యధిక సార్లు సెర్చ్ చేసిన పదంగా లక్షద్వీప్ నిలిచింది. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా లక్షద్వీప్ కు మద్దతుగా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలా మంది పర్యాటకులు మాల్దీవుల ట్రిప్‌లను రద్దు చేసుకుంటున్నామంటూ ట్వీట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..