‘టిల్లు స్కేర్’ మరో అర్జున్ రెడ్డి అవుతుందా.?

- January 08, 2024 , by Maagulf
‘టిల్లు స్కేర్’ మరో అర్జున్ రెడ్డి అవుతుందా.?

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘టిల్లు స్క్వేర్’. ‘డీజె టిల్లు’ సూపర్ హిట్టవ్వడంతో, గ్యాప్ తీసుకోకుండా మనోడు ఈ సీక్వెల్ మూవీని పట్టాలెక్కించేశాడు.
అంతా బాగానే వుంది. కానీ, తొలి పార్ట్‌లో హీరోయిన్ అయిన నేహా శెట్టి.. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. సెకండ్ హీరోయిన్ కాదు.. జస్ట్ గెస్ట్ రోల్ పోషిస్తోందంతే.
అయితే, మెయిన్ లీడ్ హీరోయినిజం చూపిస్తోన్న అనుపమ పరమేశ్వరన్.. అంతకంతకూ హాట్ టాపిక్ అవుతోంది. అందుకు కారణం ఈ సినిమాలో అమ్మడు శృతి మించి అందాల ప్రదర్శన చేయడమే.
అంతేకాదు, హీరోతో ఇంటిమేట్ సిన్లలో భీభత్సంగా నటించేసిందంటూ టాక్. టాక్ ఏంటీ.? ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ఒక్కో పోస్టర్ ఆ విషయాన్ని ప్రూవ్ చేస్తూనే వుంది. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన పోస్టర్ అయితే, ఆ విషయాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లిపోయింది.
చూస్తుంటే.. ‘టిల్లు స్క్వేర్’ మరో ‘అర్జున్ రెడ్డి’ అయిపోతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ అంటే ఒక రెస్పెక్ట్‌బుల్ హీరోయిన్. పర్‌ఫామెన్స్‌కి తప్ప ఎక్స్‌పోజింగ్‌కి ఎప్పుడూ ఎక్కువ స్పేస్ ఇచ్చింది లేదింతవరకూ.
కానీ, అది గతం. ఇప్పుడు ఆమె మారిపోయింది. ఏ రేంజ్ గ్లామర్ అయినా ఏ టైప్ ఆఫ్ రొమాంటిక్ సీన్లలోనైనా అలవోకగా నటించేస్తోంది మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com