కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుంది.?
- January 09, 2024
శరీరానికి సరిపడా కాల్షియం అందకపోతే, కీళ్ల నొప్పులు, ఎముకలు పటుత్వం కోల్పోవడం, దంత సమస్యలు తదితర సమస్యలు వేధిస్తాయ్. అందుకే చాలా మంది కాల్షియం తక్కువగా వుందంటే సప్లిమెంట్స్ వాడుతుంటారు.
ట్యాబ్లెట్ల రూపంలో వాడే సప్లిమెంట్ల ఆరోగ్యానికి మంచిది కాదనీ, వాటితో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయనీ నిపుణులు చెబుతున్నారు.
ఆహారంలో సహజ సిద్ధంగా తీసుకునే కాల్షియం వల్ల ఎటువంటి నష్టం కలగదు. కానీ, ట్యాబ్లెట్ల రూపంలో తీసుకునే కాల్షియం మూత్ర పిండాల్లోని లవణాలతో కలిసి రాళ్లలాగా మారుతుంది. అవి తర్వాత మూత్రాశయానికి అడ్డంకిగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయ్.
అందుకే కాల్షియం సప్లిమెంట్లు ఎలా పడితే అలా వాడరాదని.. నిపుణుల సలహా ప్రకారం మాత్రమే కాల్షియం సప్లిమెంట్లు వాడాలని చెబుతున్నారు.
క్యారెట్, బీట్ రూట్, చేపలు, గుడ్లు వంటి ఆహారంలో కాల్షియం అధికంగా లభిస్తుంది. కాల్షియం అధికంగా వుండే ఆహరం తీసుకోవడం వల్ల అందులోని కాల్షియంని ప్రేగులు గ్రహించి ఆక్సలైట్స్తో కలిపి బంధిస్తాయ్. అందువల్ల రాళ్లు ఏర్పడే అవకాశం తక్కువగా వుంటుంది. సో, కాల్షియం సప్లిమెంట్ల పేరు చెప్పి, ట్యాబ్లెట్లు తీసుకోవడం మంచిది కాదనేది నిపుణులు సలహా.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..