గుజరాత్ సమ్మిట్: యూఏఈతో భారత్ కీలక ఒప్పందాలు

- January 10, 2024 , by Maagulf
గుజరాత్ సమ్మిట్:  యూఏఈతో భారత్ కీలక ఒప్పందాలు

గాంధీనగర్: వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌కు ముందు ఇండో-యూఏఈ మధ్య కీలక రంగాల్లో అవగాహన ఒప్పందాలు జరిగాయి. యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బుధవారం ప్రారంభం కానున్న వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌ శిఖరాగ్ర సదస్సు 10వ ఎడిషన్‌కు యూఏఈ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. పునరుత్పాదక ఇంధన రంగాలలో పెట్టుబడి సహకారం, వినూత్న ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు, ఫుడ్ పార్క్ అభివృద్ధి, సమర్థవంతమైన ఓడరేవులను సృష్టించడంపై జరిగిన అవగాహన ఒప్పందాలపై భారతదేశం -యూఏఈ సంతకం చేశాయి. గత 7 నెలలలో యూఏఈ-భారత్ మధ్య ఇది 4వ సమావేశమని, ఇరు దేశాలమధ్య భాగస్వామ్యాన్ని వేగంగా మార్చడాన్ని నాయకులు సంపన్నమైన భవిష్యత్తు కోసం తమ నిబద్ధతను పునరుద్ఘాటించారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com