అయోధ్య శ్రీరాముడి బంగారు పాదుకలకు తెలంగాణా గవర్నర్ పూజలు

- January 10, 2024 , by Maagulf
అయోధ్య శ్రీరాముడి బంగారు పాదుకలకు తెలంగాణా గవర్నర్ పూజలు

హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం రాజ్‌భవన్‌లో అయోధ్య శ్రీరాముడి బంగారు పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి ఈ అద్భుతమైన పాదుకలను అయోధ్య శ్రీరామ మందిరానికి విరాళంగా అందజేస్తున్నారు. రాజ్ భవన్‌లో ఈ పవిత్ర పాదుకలకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తోపాటు ఇతర రాజ్ భవన్ సిబ్బంది పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా చల్లా శ్రీనివాస శాస్త్రి చేసిన కృషిని, శ్రీరామునికి అంకితభావంతో ఆయన చేసిన సేవలను గవర్నర్ తమిళిసై కొనియాడారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com