సౌదీలో కొత్తగా ఐదు కొత్త ప్రీమియం రెసిడెన్సీ స్కీములు
- January 11, 2024
రియాద్: సౌదీ అరేబియా ప్రీమియం రెసిడెన్సీ సెంటర్ బుధవారం ఐదు వినూత్న ప్రీమియం రెసిడెన్సీ ఉత్పత్తులను ఆవిష్కరించింది. దేశాన్ని ప్రముఖ గ్లోబల్ హబ్‌గా నిలబెట్టడంతోపాటు నైపుణ్యం కలిగిన నిపుణులు, పెట్టుబడిదారులు మరియు వ్యవస్థాపకులను ఆకర్షించడం దీని లక్ష్యంగా పేర్కొన్నారు. స్పెషల్ టాలెంట్, గిఫ్టెడ్, ఇన్వెస్టర్, ఎంటర్‌ప్రెన్యూర్ మరియు రియల్ ఎస్టేట్ ఓనర్ రెసిడెన్సీ ఇలా ఐదు కొత్త ప్రీమియం రెసిడెన్సీ కేటగిరీలను ప్రకటించారు. ప్రతి కేటగిరీ నిర్దిష్ట రంగాలు, నైపుణ్యం సెట్‌లకు అనుగుణంగా రూపొందించారు. 'స్పెషల్ టాలెంట్' రెసిడెన్సీ ఆరోగ్య సంరక్షణ, సైన్స్ మరియు పరిశోధనలో ఎగ్జిక్యూటివ్‌లు మరియు నిపుణులను లక్ష్యంగా ప్రకటించారు. సౌదీ అరేబియా డైనమిక్ సాంస్కృతిక, క్రీడా రంగాలలో నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించేందుకు 'గిఫ్టెడ్' రెసిడెన్సీని రూపొందించారు. 'ఇన్వెస్టర్' రెసిడెన్సీని పెట్టుబడుల ఆకర్షణ కోసం తీసుకొచ్చారు. 'ఎంట్రప్రెన్యూర్' రెసిడెన్సీ ప్రతిష్టాత్మక వ్యాపారవేత్తలు, వినూత్న ప్రాజెక్ట్ యజమానులను లక్ష్యంగా ప్రవేశపెట్టారు. చివరగా 'రియల్ ఎస్టేట్ ఓనర్' రెసిడెన్సీ అనేది సౌదీ అరేబియాలో ఆస్తిని కలిగి ఉన్న వారి కోసం, దేశం అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ నుండి ప్రయోజనం పొందుతూ అసాధారణమైన జీవన నాణ్యతను ఆస్వాదించడానికి వీలుగా రూపొందించబడింది. వివిధ ప్రభుత్వ సంస్థల సహకారంతో అభివృద్ధి చేయబడిన ఈ ఉత్పత్తులు హోల్డర్‌లకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..