కంటెంట్ సృష్టికర్తలకు మద్దతు.. Dhs150 మిలియన్ల నిధిని ప్రకటించిన షేక్ మహమ్మద్
- January 11, 2024
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ సృష్టికర్తలకు మద్దతు ఇవ్వడానికి 150 మిలియన్ల నిధులను, శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన ఎక్స్ అకౌంట్లో ప్రకటించారు. I బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్ నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఇది దుబాయ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద కంటెంట్ సృష్టికర్తల సమ్మేళనంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ మాట్లాడుతూ.. యూఏఈ నేడు 3,000 మంది కంటెంట్ సృష్టికర్తలకు హోస్ట్‌గా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల నుండి 1.8 బిలియన్లకు పైగా అనుచరులతో కంటెంట్ సృష్టికర్తల అతిపెద్ద ప్రపంచ సమావేశాలలో ఇది ఒకటన్నారు. ‘‘కంటెంట్ సృష్టి బాధ్యత, మీడియా భవిష్యత్తు అని వారికి తెలియజేస్తున్నాము. మేము కంటెంట్ సృష్టికర్తలకు మద్దతు ఇవ్వడానికి.. వారి నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి వారిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి వారి కోసం శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి Dhs150 మిలియన్ల నిధిని ప్రకటించాము" అని షేక్ మహ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..