నైపుణ్యం కలిగిన కార్మికులకు టెక్నికల్ పరీక్షలు తప్పనిసరి
- January 12, 2024
కువైట్: కువైట్‌లో నైపుణ్యం కలిగిన కార్మికులకు తప్పనిసరిగా ప్రాక్టికల్ మరియు టెక్నికల్ టెస్ట్‌లను నిర్వహించేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ అప్లైడ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌తో కుదిరిన అవగాహన ఒప్పందంపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ (PAM) సంతకం చేసింది. కొత్త వర్క్ పర్మిట్లకే కాకుండా.. ఇప్పటికే ఉన్న వర్క్ పర్మిట్ల పునరుద్ధరణకు కూడా ఈ పరీక్ష తప్పనిసరి అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇఖామా పునరుద్ధరణకు ముందు కార్మికులు తప్పనిసరిగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ప్రాధాన్యత ఆధారంగా వివిధ వృత్తుల కోసం దశలవారీగా పరీక్ష ప్రారంభించబడుతుంది. సంబంధిత రంగాలలో స్పెషలైజేషన్‌ని నిర్ధారించడానికి, అర్హత లేని కార్మికులను మార్కెట్ నుండి తొలగించడానికి కాంట్రాక్టు రంగం ప్రాథమికంగా దృష్టి పెడుతుందని అధికార వర్గాలు సూచించాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..