ఆసియా కప్: తొలి మహిళా రిఫరీగా జపాన్‌కు చెందిన యమషిత!
- January 12, 2024
దోహా : జపాన్‌కు చెందిన యోషిమి యమషిత.. భారత్-ఆస్ట్రేలియా మ్యాచుకు బాధ్యతలు స్వీకరించినప్పుడు పురుషుల ఆసియా కప్‌లో రిఫరీగా చరిత్రలో నిలిచిన మొదటి మహిళ అని ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ గురువారం తెలిపింది. 2022 పురుషుల ప్రపంచ కప్‌లో నాల్గవ అధికారి అయిన యమషిత.. ఖతార్‌లో జరిగిన ఆసియా కప్‌లో ఐదుగురు మహిళా మ్యాచ్ అధికారులలో ఒకరిగా సేవలు అందిస్తున్నారు. 18వ ఎడిషన్ టోర్నీ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
మకోటో బోజోనో మరియు నవోమి టెషిరోగి అసిస్టెంట్ రిఫరీలుగా నియమితులైన యమషిత శనివారం గ్రూప్ B ఓపెనింగ్ మ్యాచ్ కు బాధ్యతలు స్వీకరిస్తారు. 2022లో ఆసియా ఛాంపియన్స్ లీగ్‌లో మరియు ఒక సంవత్సరం తర్వాత జపాన్ దేశీయ J-లీగ్‌లో ఒక గేమ్‌కు పూర్తి మహిళా రిఫరీగా బాధ్యతలు చేపట్టి ఆమె చరిత్ర సృష్టించింది. 37 ఏళ్ల యమషిత గత ఏడాది ఆస్ట్రేలియా , న్యూజిలాండ్‌లో జరిగిన మహిళల ప్రపంచ కప్‌లో ప్రారంభ మ్యాచ్ కు రిపరీగా బాధ్యతలు చేపట్టి వార్తల్లో నిలిచారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..