యూఏఈలో ప్రీ-బోర్డ్ పరీక్షలు ప్రారంభం

- January 12, 2024 , by Maagulf
యూఏఈలో ప్రీ-బోర్డ్ పరీక్షలు ప్రారంభం

యూఏఈ:  యూఏఈలోని CBSE అనుబంధ పాఠశాలల్లో విద్యార్థులు ప్రస్తుతం తమ ప్రీ-బోర్డ్ లేదా మాక్ పరీక్షలు రాస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10 మరియు 12 తరగతులకు ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్న బోర్డు పరీక్షల కంటే ముందు ఇవి నిర్వహించబడుతున్నాయి. పరీక్షలు ఏప్రిల్ 2 న ముగుస్తాయి.  అన్ని పరీక్షలు యూఏఈ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని అబుదాబిలోని GEMS యునైటెడ్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్/సీఈఓ K జార్జ్ మాథ్యూ తెలిపారు. జనవరి మూడవ వారంలో బోర్డు ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయని చెప్పారు. బోర్డు ప్రాక్టికల్ పరీక్షల కోసం ఇతర పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులను నియమించిందని GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ లలిత సురేష్ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com