హౌతీలపై అమెరికా, బ్రిటన్‌లు దాడులు.. సౌదీ అరేబియా కీలక వ్యాఖ్యలు

- January 12, 2024 , by Maagulf
హౌతీలపై అమెరికా, బ్రిటన్‌లు దాడులు.. సౌదీ అరేబియా కీలక వ్యాఖ్యలు

రియాద్: ఎర్ర సముద్రం ప్రాంతంలో జరుగుతున్న సైనిక కార్యకలాపాలు, యెమెన్ రిపబ్లిక్‌లోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. అమెరికా, యూకే లు యెమెన్ లోని హౌతీలపై భారీ దాడులు ప్రారంభించాయి. దాడులపై సౌదీ అరేబియా స్పందించింది. సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఈ ప్రాంతం స్థిరత్వం, భద్రతను కాపాడుకోవడానికి శాంతియుత తీర్మానం అవసరం ఉందని తెలిపింది. యూఎస్,  బ్రిటీష్ మిలిటరీలు గురువారం యెమెన్‌లో ఇరాన్-మద్దతుగల హౌతీలకు చెందిన జనుకు పైగా సైట్‌లపై బాంబు దాడులు చేశాయి.  అమెరికా మరియు దాని మిత్రదేశాలు ఎర్ర సముద్రం మీద మిలిటెంట్ గ్రూప్ యొక్క నిరంతర దాడులను సహించవని, అందుకే ఈ దాడులు చేసినట్లు అధ్యక్షుడు జో బిడెన్ పేర్కొన్నారు.  మరోవైపు తైఫ్‌లోని కింగ్ ఫహద్ ఎయిర్ బేస్‌లో విదేశీ బలగాలు ఉన్నాయనే పుకార్లను సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ పుకార్లు అబద్ధమని మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ టర్కీ అల్-మాలికీ స్పష్టం చేశారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com