ఫిబ్రవరి 10న దుబాయ్‌లో అనిరుధ్ ‘హుకుమ్ వరల్డ్ టూర్ కాన్సర్ట్’
- January 13, 2024
దుబాయ్: దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో 'హుకుమ్ వరల్డ్ టూర్ - అలపారా కేలప్పరోమ్ కాన్సర్ట్'తో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తన గ్లోబల్ జర్నీని ప్రారంభించనున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన బాలీవుడ్ సినిమా జవాన్‌తో సహా పలు తమిళం, మలయాళం, తెలుగు చిత్రాలకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహారించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కవిన్ చంద్రశేఖరన్ సారథ్యంలోని మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో ప్రెజెంటింగ్ పార్ట్నర్గా ఇండియన్ బేస్డ్ కంపెనీ పల్స్‌తో కలిసి భారతదేశపు ప్రీమియర్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్రాండ్ అవతార్ నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10న యూఏఈ ప్రజలను మంత్రముగ్దులను చేయనుంది.
2012లో ఫిల్మ్ 3 కోసం కంపోజ్ చేసిన "వై దిస్ కొలవెరి డి" అనే తన తొలి పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారడంతో తన పేరు మార్మోగింది. ఇది యూట్యూబ్‌లో 400 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అనిరుధ్ ఇప్పటివరకు రెండు ఫిలింఫేర్ అవార్డ్స్, తొమ్మిది సైమా(SIIMA) అవార్డులు, ఆరు ఎడిసన్ అవార్డులు, ఐదు విజయ్ అవార్డులు అందుకున్నారు.
అట్లీ దర్శకత్వం వహించిన 'జవాన్' సినిమాతో ఇటీవల బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. “నేను ఎల్లప్పుడూ విభిన్న ప్రేక్షకులతో ప్రతిధ్వనించే సంగీతాన్ని రూపొందించడంపై దృష్టి పెట్టాను. ఈ ప్రయాణం ఒక ఆశీర్వాదం. హుకుమ్ వరల్డ్ టూర్‌తో నా విజయాన్ని, ప్రయాణాన్ని అభిమానులతో పంచుకుంటున్నాను. నేను యూఏఈ వాసులను కలవడానికి మరియు సంగీతంలో మునిగిపోవడానికి, వారికి సహాయం చేయడానికి ఎదురుచూస్తున్నాను.’’ అని అనిరుధ్ అన్నారు. ఇక ఈ మ్యూజిక్ కాన్సర్ట్ టిక్కెట్లు కోకా-కోలా అరేనా మరియు వర్జిన్ టిక్కెట్లలో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!