ఫిబ్రవరి 11నంచి బహ్రెయిన్‌లో స్ప్రింగ్ ఆఫ్ కల్చర్ ఫెస్టివల్

- January 13, 2024 , by Maagulf
ఫిబ్రవరి 11నంచి బహ్రెయిన్‌లో స్ప్రింగ్ ఆఫ్ కల్చర్ ఫెస్టివల్

బహ్రెయిన్‌: ఫిబ్రవరి 11నంచి 18వ ఎడిషన్ స్ప్రింగ్ ఆఫ్ కల్చర్ ఫెస్టివల్ జరుగనుంది. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ (BACA), షేక్ ఇబ్రహీం బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా సెంటర్ ఫర్ కల్చర్ అండ్ రీసెర్చ్, అల్ డానా యాంఫీథియేటర్, అల్ రివాక్ ఆర్ట్ స్పేస్, అల్బరే ఆర్ట్ గ్యాలరీ, ఆర్ట్ కాన్సెప్ట్ మరియు లా ఫోంటైన్ సెంటర్ ఫర్ కాంటెంపరరీ ఆర్ట్ సహకారంతో నిర్వహిస్తున్నారు.  ఈ కార్యక్రమం ఫిబ్రవరి 11న బహ్రెయిన్ నేషనల్ థియేటర్‌లో ప్రారంభమవుతుంది. మాస్ట్రో జెయాద్ జైమాన్ నేతృత్వంలోని బహ్రెయిన్ మ్యూజిక్ బ్యాండ్‌ ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిల్వనుంది.  ఫెస్టివల్‌లో నేషనల్ థియేటర్ వేదికగా బహ్రెయిన్ మాస్ట్రో వహీద్ అల్ ఖాన్ "బ్యాక్ టు లైఫ్" కాన్సర్ట్ ఉంటుంది. అదే విధంగా ప్రఖ్యాత కళాకారులు ఖలీద్ అల్ షేక్, హుదా అబ్దుల్లా "ఘనావి అల్-షౌక్"తో సందడి చేయనున్నారు.  అల్ డానా యాంఫీ థియేటర్ వేదికగా బహ్రెయిన్ నేషనల్ థియేటర్ ప్రదర్శనలు ఉంటాయి.  మెరూన్ 5 కచేరీ, జోహన్ స్ట్రాస్ ఆర్కెస్ట్రాతో మాస్ట్రో మరియు వయోలిన్ వాద్యకారుడు ఆండ్రే రియూ ప్రదర్శన, ట్రెవర్ నోహ్ మరియు కెవిన్ హార్ట్‌లతో కూడిన ప్రదర్శనతో సహా పలు అంతర్జాతీయ ప్రదర్శనలు ఉంటాయని బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ (BACA) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com