పేరెంటల్ లీవ్ ప్యాకేజీలు.. మారుతున్న కంపెనీల ఆలోచనలు!

- January 14, 2024 , by Maagulf
పేరెంటల్ లీవ్ ప్యాకేజీలు.. మారుతున్న కంపెనీల ఆలోచనలు!

మస్కట్: మెరుగైన పని సంస్కృతులను రూపొందించే దిశగా మరిన్ని సంస్థలు తల్లిదండ్రుల సెలవులను పెంచుతున్నాయి. కొత్త చట్టాల ప్రకారం.. పురుష ఉద్యోగులు ఇప్పుడు ఏడు రోజులపాటు యజమాని-చెల్లింపుతో కూడిన పితృత్వ సెలవులను పొందవచ్చు. ఒమన్‌లోని ప్రముఖ కేబుల్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఒమన్ కేబుల్స్ ఇండస్ట్రీ (OCI).. కొత్త పేరెంటల్ పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం బ్రాండింగ్‌ను పెంచడంతోపాటు ఉద్యోగుల నిలుపుదలని బలోపేతం చేస్తుందన్నారు. అదే సమయంలో పూర్తి జీతంతో తల్లులకు ప్రసూతి కవరేజ్ వ్యవధిని 12 నుండి 16 వారాల వరకు పొడిగించినట్లు తెలిపింది. అదే విధంగా ఉద్యోగి కుటుంబానికి కొత్త చేరికను స్వాగతించడంలో ఉన్న ప్రత్యేక సవాళ్లను గుర్తిస్తూ.. OCI జనవరి 1 నుండి “బేబీ బోనస్” కింద OMR900 ని అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది నుంచి 10 రోజుల పేరెంటల్ లీవ్‌ను అందించనున్నట్లు మరో ప్రైవేట్ సంస్థ ప్రకటించింది. ఇదే బాటలో పలు ప్రైవేట్ కంపెనీలు త్వరలో ప్రకటనలు చేయొచ్చని నిపుణులు అభిప్రాపడ్డారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com