ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్. ఆకట్టుకున్న స్టాల్స్

- January 16, 2024 , by Maagulf
ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్. ఆకట్టుకున్న స్టాల్స్

బహ్రెయిన్: భారతీయ రాయబార కార్యాలయం "ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్"ని నిర్వహించింది.  ఈ కార్యక్రమం జనవరి 12న సీఫ్‌లోని రాయబార కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు.  ఈ ఫెస్టివల్ లో బహ్రెయిన్‌లోని భారతీయ సమాజంలోని 500 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ డయాస్పోరా చొరవతో సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, కమ్యూనిటీల సాంస్కృతిక సంపదను పంచుకోవడానికి ఇది వేదికగా నిలిచింది. బహ్రెయిన్‌లో నివసిస్తున్న ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీతలు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఫెస్టివల్‌లో 30 కంటే ఎక్కువ భారతీయ కమ్యూనిటీ అసోసియేషన్‌లు భారతదేశ ఫుడ్ వెరైటీలు, హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో బహ్రెయిన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థి కాశ్వి సుబిన్ జగదీష్ రాసిన హెడ్‌స్ట్రింగ్స్ అనే కవితా సంకలనాన్ని కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ICRF బులెటిన్‌ను కూడా విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com