ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల

- January 16, 2024 , by Maagulf
ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ హైకమాండ్‌ నిర్ణయాన్ని కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో చోటు కల్పించారు.

తెలంగాణ వేదికగా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని రెండేళ్ళ క్రితం స్థాపించిన వైఎస్ షర్మిల... కొద్దిరోజుల కిందటే కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారని బావించినా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి ఉండేలా ఆమెను ఒప్పించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధించిన నెల రోజుల్లోపే ఢిల్లీ వేదికగా ఆమె హస్తం కండువా కప్పేసుకున్నారు. తాజాగా ఆమెను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

గిడుగు రాజీనామా...సిడబ్ల్యుసిలో చోటు
ఇప్పటి వరకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి బాధ్యతలు చూసిన గిడుగు రుద్రరాజు సోమవారం తన పదవి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పీసీసీ పదవికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ పంపారు.

అమలాపురం పట్టణానికి చెందిన గిడుగు రుద్రరాజు... 2022 నవంబరులో ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. 2005 నుంచి 2007 వరకు వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌గా... 2007 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. గతంలో ఒడిశా రాష్ట్రానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇంచార్జి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆయనకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో చోటు కల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com