70 పెవిలియన్లతో కహ్రామాన్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- January 16, 2024
దోహా: కటారా గ్రామంలోని బిల్డింగ్ 12 వద్ద కహ్రామాన్ (అంబర్) కోసం తన అంతర్జాతీయ ప్రదర్శన 4వ ఎడిషన్‌ను కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ ఆవిష్కరించింది. ఈ సంవత్సరం ప్రదర్శనకారుల భాగస్వామ్యం 70 పెవిలియన్లకు విస్తరించింది. గతంలో వీటి సంఖ్య 50 మాత్రమే. కటారా జనరల్ మేనేజర్ ప్రొఫెసర్ డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రహీం అల్ సులైతి మాట్లాడుతూ.. 2019లో ఎగ్జిబిషన్ ప్రారంభమైనప్పటి క్రమంగా ఇది విస్తరిస్తుందని తెలిపారు. ఇది ఖతార్ ప్రధాన ఈవెంట్‌గా ప్రత్యేకంగా నిలుస్తుందని, పోలాండ్ తర్వాత ఈ రంగంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద అంతర్జాతీయ ప్రదర్శన ఇదేనని స్పష్టం చేశారు. AFC ఆసియా కప్ సందర్భంగా ఈ సంవత్సరం ప్రారంభించిన ఎగ్జిబిషన్.. దేశీయ మరియు అంతర్జాతీయంగా ప్రేక్షకులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇక్కడి పెవిలియన్లలో 'బ్లాక్ పెర్ల్' అనే ఓడ నుండి గుర్రాలు, పులులు మరియు ఫాల్కన్ల వంటి జంతువుల వరకు, కహ్రామాన్ ఇస్లామిక్ ప్రార్థన పూసలు మరియు క్లిష్టమైన సుభా సేకరణలు, వివిధ రకాల హస్తకళలతో ఈ ప్రదర్శన ఆకర్షణీయంగా ఉంటుందని వివరించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!