అరటి పండులోని పోషకాల గురించి తెలిస్తే.!
- January 16, 2024
ఆప్ట్రాల్ అరటిపండు.. అనుకుంటాం. ఎందుకంటే పండ్లలో అతి తేలికగా లభించే పండు అరటి పండు. చాలా మంది అరటి పండును లైట్ తీసుకుంటారు. కానీ, అరటి పండులో ఎన్నో పోషకాలున్నాయ్. వాటితో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. ఎన్నెన్నో.!
అవేంటో తెలుసుకుందామా.? అరటి పండులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. అందుకే మలబద్దకం వున్నవారికి ఇదో వరంగానే చెప్పొచ్చు. అరటిపండులోని సింథటిక్ లాక్సిటివ్గా పని చేస్తుంది. సో, క్రమం తప్పకుండా అరటి పండు తింటే, మలబద్ధకం అనే సమస్య దరి చేరదు.
అలాగే అజీర్తి సమస్య వున్నవాళ్లకీ అరటి పండు మంచి ఔషధంగా పని చేస్తుంది. అంతేకాదు, అరటి పండులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయ్. శరీరం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి చాలా అవసరం.
అయితే, అరటి పండులో కాలరీలు ఎక్కువగా వుంటాయ్. ఊబకాయం వున్నవాళ్లు కాస్త ఆచి తూచి తినాల్సి వుంటుంది. కేలరీలు అధికంగా వుండడం వల్లనే.. ఎక్కువ ఆకలిగా అనిపించినప్పుడు ఒక్క అరటి పండు తింటే.. కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది.
అరటి పండులో కార్భోహైడ్రేట్లు కూడా పుష్కలంగా వుండడంతో పాటూ, అంతకు రెండు రెట్లు విటమిన్ ఎ అధికంగా వుంటుంది. రక్తపోటు అదుపులో వుంచేందుకు అరటి పండు ఓ దివ్యౌషధమే అని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!