మాజీ ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష

- January 17, 2024 , by Maagulf
మాజీ ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష

దుబాయ్: జూలై 2020లో జరిగిన ఒక సంఘటనలో తన యూరోపియన్ స్నేహితురాలిని హత్య చేసినందుకు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఒక అరబ్ వ్యక్తికి మరణశిక్ష విధించింది. తన మాజీ స్నేహితురాలు మరొక వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకోవడంతో తనను హత్య చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్లు కోర్టు ఫైల్స్ ద్వారా తెలుస్తోంది.  నిందితుడు హత్యకు ముందే ప్లాన్ చేసి.. చాలా రోజుల పాటు ఆమెను వెంబడిస్తూ తన మాజీ ప్రియురాలి కదలికలను నిశితంగా గమనించాడని, హత్య జరిగిన రోజు ఆమె ఇంట్లోకి ప్రవేశించి మెడ కోసి హత్య చేశాడు.  సమాచారం అందుకున్న దుబాయ్ పోలీసులు మృతదేహాన్ని తరలించి, ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. దర్యాప్తు బృందం తగిన ఆధారాలు సేకరించి, నిందితుడిని గుర్తించింది.  తప్పించుకున్న నిందితుడు షాపింగ్ మాల్ దగ్గర ఉండగా పట్టుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిందితుడు 2017లో బాధితురాలితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అనంతరం విడిపోయారు. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తి సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అనంతరం బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలు రెండేళ్లు దుబాయ్ వదిలివెళ్లింది. అనంతరం మరోసారి బాధితురాలిని నిందితుడు కలుసుకున్నాడు. ఈక్రమంలో బాధితురాలికి 30,000 దిర్హామ్‌లను అప్పుగా ఇచ్చాడు. అయినా మృతురాలు వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి. నిందితుడికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించి తెగతెంపులు చేసుకున్నది. కానీ అతను ఆమెపై పగతో రగిలిపోయాడు. పక్కా ప్రణాళికతో ఓ రోజు ఆమె ఉంటున్న అపార్టుమెంట్ కు వెళ్లి హత్య చేసి పారిపోయాడు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com