పెరిగిన మెంటల్ హెల్త్ కేర్ ఖర్చులు.. ఫారీన్ కౌన్సెలర్‌లను ఆశ్రయిస్తున్న నివాసితులు

- January 17, 2024 , by Maagulf
పెరిగిన మెంటల్ హెల్త్ కేర్ ఖర్చులు.. ఫారీన్ కౌన్సెలర్‌లను ఆశ్రయిస్తున్న నివాసితులు

యూఏఈ: మెంటల్ హెల్త్ కేర్ ఖర్చులు పెరగడంతో నివాసితులు ఫారీన్ కౌన్సెలర్‌లను ఆశ్రయిస్తున్నారు. యూఏఈలో Dh5,000 లిమిట్ ఉన్న హెల్త్ ఫాలసీ మొత్తం మానసిక ఆరోగ్య చికిత్సపై ఖర్చు అయిందని, ఆ తర్వాత సొంతంగా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, దీంతో ఆన్ లైన్ చికిత్స కోసం వెతుకుతున్నట్లు యూఏఈలో ఉండే అమెరికన్ జాక్(పేరు మార్చారు) తెలిపారు.  మరికొందరు మాత్రం తమ సొంత దేశాల్లోని డాక్టర్లతో సంప్రదించేందుకు ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలిపారు. అదే యూఏఈలో అయితే Dh1,000 చెల్లించాల్సి ఉంటుందని ఓ భారతీయ ప్రవాసుడు వెల్లడించారు. ఇలా అనేక కారణాల వల్ల అనేక మంది యూఏఈ నివాసితులు ఇతర దేశాల నుండి ఆన్‌లైన్ థెరపిస్ట్‌లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. కొందరు ఖర్చులను చెబుతుంటే.. మరికొందరు తమ నేపథ్యం మరియు సంస్కృతిని అర్థం చేసుకోగల వ్యక్తిని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. కొన్ని ఆన్‌లైన్ మానసిక ఆరోగ్య ప్లాట్‌ఫారమ్‌లు మతపరమైన దృక్పథం, మానసిక ఆరోగ్య కారకాలు మరియు ఆధ్యాత్మికతతో సహా పలు అంశాలపై వారి సలహాదారుని ఎంచుకోవడానికి రోగులకు ఆప్షన్లు ఇస్తున్నాయి.  "నేను దుబాయ్‌లో మ్యారేజ్ కౌన్సెలింగ్ కు హాజరైన సమయంలో ఒక్కో సెషన్ ధర సుమారు Dh1,200. దుబాయ్‌లో ఇతర మానసిక ఆరోగ్య సేవలు Dh350 మరియు Dh800 మధ్య ఉంటాయి. నేను షార్జాకు డ్రైవింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటే, అది ఒక సెషన్‌కు Dh275కి తగ్గించుకోవచ్చు. అదే సమయంలో నేను అమెరికన్ సీనియర్ వైద్యుడిని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను ఆశ్రయించినప్పుడు ఆ ఖర్చును మరింత తగ్గించుకున్నారు. ’’ ఓ దుబాయ్ నివాసి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com